calender_icon.png 11 November, 2025 | 12:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంగళరావునగర్‌లో హైటెన్షన్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత

11-11-2025 10:53:47 AM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా మంగళవారం డబ్బు పంపిణీ ఆరోపణలపై కాంగ్రెస్, బీఆర్ఎస్(Congress and BRS) కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో వెంగళరావునగర్‌లో(Vengalrao Nagar) స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. బూత్ నంబర్ 180 వద్ద ఉన్న కాంగ్రెస్ నాయకులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను గమనించి, వారు డబ్బు పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తూ వారిపై దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే, ఓటర్ల జాబితాలో తమ పేరును తనిఖీ చేసుకోవడానికి మాత్రమే ప్రజలకు సహాయం చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఓటర్లలో భయాన్ని కలిగించడానికి వారిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు అక్కడికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. 

లోకల్ కాంగ్రెస్ నాయకుడు బూత్ నెం 205 వెంగళరావునగర్ లో ఓటర్లకు డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయాడు. బీఆర్ఎస్ కార్యకర్తలు అతన్ని పట్టుకొని అధికారులకు అప్పగించారు. కాంగ్రెస్ నాయకులు బోరబండ వీకర్ సెక్షన్ ఎరియా సైట్ 3 లో బూత్ ఎజెంట్లపై దౌర్జన్యం చేస్తూ కౌంటర్ లను ధ్వసం చేసినట్లు  బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ గల్లీ లీడర్లు పోలింగ్ కేంద్రాల వద్దే యధేచ్చగా డబ్బులు పంచుతున్నట్లు బీఆర్ఎస్ పేర్కొంది. రహమత్ నగర్ బూత్ 156 వద్ద ఓటర్లకు కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నరంటూ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పలు పోలింగ్ కేంద్రాల్లో స్థానికేతర నాయకులు వచ్చి హల్చల్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.