07-02-2025 11:05:42 AM
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో నిందితుడిపై కేసు నమోదు
ఇబ్రహీంపట్నం,(విజయక్రాంతి): విద్యార్థులకు చదువు చెప్పి విద్యా బుద్దులు నేర్పాల్సిన వాడే కామాంధుడిగా మారాడు. ఓ స్కూల్ చైర్మన్ అభం శుభం తెలియని మైనర్ విద్యార్ధినిపై అత్యాచారయత్నం చేసిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) లయోలా పాఠశాల ప్రిన్సిపాల్ దినవాన్ రావు(Loyola School Principal Dinavan Rao)పై ఇబ్రహీంపట్నం పోలీసులు ఫోక్సో కేసు(POCSO Act) నమోదు చేశారు. కానీ ఈ సంఘటన జరిగి దాదాపు నాలుగు రోజులు గడుస్తున్న సమాచారం బయటకు రాకుండా పోలీసులు గొప్యంగా వ్యవహరించించినట్లు తెలుస్తోంది. సమాజంలో మంచి, చెడులు చెప్పాల్సిన టీచర్ కామంతో విద్యార్థినిపై అత్యాచార యత్ననికి పాలపడ్డాడు. గతంలోనూ తనపై పలు ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థినిలను లోబర్చుకొని పలుమార్లు అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజా ఘటనలో తల్లి ఇచ్చిన పిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పిఎస్ లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గత కొన్ని రోజుల క్రితమే విద్యార్థిని పై జరిగిన అత్యాచార ఘటన మరువక ముందే మరో విద్యార్థిని పై అత్యాచారయత్నం చేయడం చర్చినీయంశంగా మారింది.