12-11-2025 06:51:33 PM
హైదరాబాద్: భీమారం మండలంలోని గొల్లవాగు ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత చేప పిల్లలను కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విడుదల చేశారు. మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం 100 శాతం రాయితీపై రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, గుంటల్లో ఉచితంగా చేప పిల్లలు విడుదల చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ... ప్రోటీన్ కావాలంటే చేపలు తినాలని, అందులో న్యూట్రిషన్ ఉంటుందన్నారు. గొల్లవాగు ప్రాజెక్టును మా నాన్న కాక వెంకటస్వామి కట్టించారని గుర్తు చేసుకున్నారు.
జూబ్లీహిల్స్ లో మాత్యకారులు కాంగ్రెక్ పార్టీకి మద్దతు ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారని ఆయన అభిప్రాయపడ్డారు. చెన్నూరులో మోడల్ ఫిష్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని, మీ అందరి కోసం భీమారంలో సొసైటీ భవనాన్ని నిర్మించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులు పలు సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఫిష్ మార్కెట్ కావాలని, విద్యుత్ లైన్స్ కావాలని, చెరువు పూడిక తీత చెరువులో చెట్లు తొలగించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి వివేక్ త్వరలోనే సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.