07-02-2026 01:36:25 AM
వెల్దుర్తి, ఫిబ్రవరి 6 :కార్పొరేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలోనే మంచి బోధన అందుతుందని వెల్దుర్తి సర్పంచ్ దండెం ఆదర్శ్ అన్నారు. శుక్రవారం వెల్దుర్తి కేజీవిపి పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ వే డుకలలోఆయన పాల్గొని మాట్లాడారు.
ప్ర భుత్వ పాఠశాలలో చదివి న విద్యార్థులు ప్రస్తుత సమాజంలో ప్రభుత్వ ఉద్యోగ రంగా ల్లో మంచి స్థానాల్లో స్థిరపడ్డారని అన్నారు. పలురంగాల్లో విద్యార్థులు కనబరిచిన ప్రతిభకు సర్పంచ్ పాఠశాల ఎస్వోలు ఫాతిమా, కృష్ణ తేజలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది విద్యా ర్థి విద్యార్థులు పాల్గొన్నారు.