calender_icon.png 1 February, 2026 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిట్ నోటీసులపై భగ్గుమన్న బీఆర్ఎస్

01-02-2026 07:06:08 PM

ఎర్రవల్లి మండల కేంద్రంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రభుత్వానికి  వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు

అలంపూర్: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు పేరుతో తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని కోరడంతో  తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఆదివారం రాష్ట్ర బీఆర్ఎస్ పిలుపుమేరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అలంపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు చేపట్టారు. ఎర్రవల్లి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయుడు పాల్గొని మాట్లాడారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితమైన ధోరణలో వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు నిరసనగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామన్నారు. అదేవిధంగా వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకురాలు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కరుణ సూరి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బిఆర్ఎస్ శ్రేణులు నల్ల బ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితి ఏర్పడుతుందన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వడ్డేపల్లి సూరి,మహిపాల్ రెడ్డి, భార్గవ్ యాదవ్ ,నాగేశ్వర్ రెడ్డి బి, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు