8 July, 2026 | 1:52 AM

ఎంఎస్ అగర్వాల్ కంపెనీ పొల్యూషన్‌తో ఇబ్బందులు..

08-07-2026 12:00 AM

భారీ పేలుళ్లతో భయాందోళనలో బిక్కు బిక్కుమంటూ బ్రతుకులు

మనోహరాబాద్, జులై 7: యం.యస్ అగర్వాల్ కంపెనీ వలన పొల్యూషన్ రావడంతో గ్రామంలో అనేక ఇబ్బందులు రోగా లు వస్తున్నాయని తెలంగాణ కాలుష్య పర్యావరణ నియంత్రణ మండలి పబ్లిక్ హీయ రింగ్ ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులు తెలిపారు.

దీని వలన వ్యవసాయ పంటలు పండడం లేదు, పాడి గేదలు చనిపోవుచుతున్నాయి, నీలు కలుషితం, భారీ పెళ్ళు లు వలన శబ్ద కాలుష్యం, ఏర్పడుతున్నాయ ని, శబ్దం వలన కర్ణ భేరీలు చెడిపోవుచున్నవని, కంపెనీనుండి దురువాసనలు వెదజ ల్లుతున్నవని, ఇళ్లలోకి దుమ్ము, దూలి వస్తుందని, చిన్నారులకు అనేక వ్యాధులు వ్యాపిస్తు న్నాయని, కొంతమేర అంగ వైకల్యం ఏర్పడుతుందని ప్రజలు అనుక్షణం భయాందోళనలో బ్రతుకుతున్నామని అన్నారు.

కంపెనీలో ప్రమాదవశాత్తు అంజలిపాండే తండ్రి కంపెనీ వర్కర్ చనిపోతే నష్టపరిహారం సరిగ్గా ఇవ్వలేదని యాజమాన్యం ఇస్తామని అంటున్నారే తప్పే పరిహారము ఇవ్వడంలేదన్నారు. ఒకవేల కంపెనీ కొనసాగితే ముఖ్యంగా కంపెనీలో పని చేయుచున్నా కార్మికులకు సదుపాయాలు కల్పించాలి, గ్రామంలో ఫంక్షన్ హాల్ చేయాలి, నెలకు ఒక్కసారి గ్రామ ప్రజల కొరకు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలి, గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు మంజూరు చేయలని గ్రామస్తులు కోరారు. ఇందులో తెలంగాణ పర్యావరణ కాలుష్య అధికారులు, వివిధ అధికారలు, కంపెనీ యాజమాన్యం, గ్రామ సర్పంచ్, పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులందరూ పాల్గొన్నారు.