16 May, 2026 | 7:10 PM

Breaking News

అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ ఎమ్మెల్యే   •   వడూర్ ద్వారా బోత్ బస్సు సర్వీసు   •   పేదలు ఉచిత న్యాయ సేవలు పొందాలి   •   పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని దిష్టిబొమ్మ దగ్ధం చేసిన సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ   •   అనురాగ్ లో “హెటెరో ల్యాబ్స్ ఎస్ఎంటీ బ్రిడ్జ్ కోర్స్ 2026–27” ప్రోగ్రాం   •   గ్రామపంచాయతీ కార్మికుల జీతాలు పెంచాలి   •   అమరవీరులకు నివాళులు అర్పించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి   •   తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి   •   కొనుగోలు చేసిన మక్కలని వెంటనే తరలించాలి   •   జాబ్ మేళాలో ఉద్యోగాల ఎంపిక   •  

కొనుగోలు చేసిన మక్కలని వెంటనే తరలించాలి

16-05-2026 06:39 PM

* అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్

గుండాల,(విజయక్రాంతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) ద్వారా ఇప్పటివరకు కొనుగోలు చేసిన మొక్కజొన్న గింజలను వెంటనే గోడౌన్లకు తరలించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) గుండాల మండల కమిటీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. శనివారం మండల కేంద్రంలో జరిగిన మండల కమిటీ సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు, గుండాల సర్పంచ్ కోరం సీతారాములు మాట్లాడుతూ.. ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం ద్వారా రైతులు పండించిన మొక్కజొన్న పంటను కొనుగోలు చేసి నేలలు గడుస్తున్నా కూడా మక్కలను గూడౌన్లకు తరలించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 వేల గన్ని బ్యాగులు సరఫరా చేయగా, కేవలం మూడు గన్ని బ్యాగుల మొక్కజొన్నను మాత్రమే  తరలించారని, మిగిలిన మొక్కజొన్నను త్వరగా తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మే 19 న రైతులతో భారీ ధర్నాను చేపట్టనున్నట్లు ఆయన హెచ్చరించారు.