జాబ్ మేళాలో ఉద్యోగాల ఎంపిక
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు మరియు నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో నిర్వహించిన మెగా జాబ్ మేళా శనివారం నిర్వహించారు కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్ ఆధ్వర్యంలో అధ్యక్షతన, టాస్క్ (TASK), కెరీర్ గైడెన్స్ సెల్ మరియు మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ (Magic Bus India Foundation) సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాకు జిల్లా నలుమూలల నుండి ఐటిఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, పీజీ చదివిన దాదాపు 100 మంది అభ్యర్థులు ఉత్సాహంగా హాజరయ్యారు.
ప్రముఖ ప్రైవేట్ రంగ సంస్థలు, ఫార్మా, బ్యాంకింగ్, ఐటీ మరియు మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు విచ్చేసి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. కాగా, వీరిలో 11 మందిని వివిధ ఉద్యోగాలకు నేరుగా ఎంపిక చేయగా, మరో 82 మందిని తదుపరి దశ ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చదువుతో పాటు మంచి ఉపాధి అవకాశాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ జాబ్ మేళా నిర్వహించినట్లు తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆయన నియామక పత్రాలను అందించారు.






