1 May, 2026 | 1:22 AM

రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు

01-05-2026 12:04 AM

నిర్మల్, ఏప్రిల్ ౩౦ (విజయక్రాంతి): నిర్మల్ నియోజవర్గంలో రైతులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల పంట కొనుగోలు పూర్తి చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరి రావు అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో మొక్క కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఇప్పటివరకు రైతుల వద్ద పెద్ద మొత్తంలో పంట కొనుగోలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.