4 April, 2026 | 3:05 AM

కాచాపూర్‌లో కొనుగోలు కేంద్రం ప్రారంభం

04-04-2026 01:18 AM

భిక్కనూర్, ఏప్రిల్ 3 (విజయ క్రాంతి): బిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామంలో శుక్రవారం సంక్షేమ కార్యక్రమాల సందడి నెలకొంది. నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంతో పాటు, రైతుల కోసం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదల సొంతింటి కల సాకారమవుతుందని, రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.

ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, రైతులు ప్రభుత్వ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, సర్పంచ్ పాలమాకుల జ్యోతి సంతోష్ గౌడ్, ఉపసర్పంచ్ బైండ్ల దశరథం, మాజీ ఎంపీపీ లు బైండ్ల సుదర్శన్, గాల్ రెడ్డి, కిష్టా గౌడ్, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.