బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి
04-04-2026 01:17 AM
భిక్కనూర్, ఏప్రిల్ 3 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన మాజీ సొసైటీ చైర్మన్ రాజగౌడ్ తల్లి మరణించిన విషయం తెలుసుకున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త తిమ్మాయ్య గారి సుభాష్ రెడ్డి అక్కడికి చేరుకుని వారి పార్థివ దేహానికి పూలు సమర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా కుటుంబానికి ధైర్యం చెబుతూ తన సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కప్పెరా రవీందర్ రెడ్డి (మాజీ వైస్ ఎంపీపీ, బీబీపేట), మట్ట శ్రీనివాస్ (సర్పంచ్), కప్పర సిద్ధరాం రెడ్డి, వెంకట్ రెడ్డి, అశోక్ గౌడ్, సాయికుమార్, చాట్ల బాబు, రవి, సతీష్ రెడ్డి, సుదర్శన్ గౌడ్, స్వామి గౌడ్, మెరుపుల గణేష్, వెంకట స్వామి, మెజీషియన్ సంతోష్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.




