30 August, 2026 | 4:18 AM

పిల్లల సినిమా నిర్మాణం సంతృప్తినిచ్చింది

30-08-2026 12:24 AM

ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న బాలల చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. దీన్ని మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో ఈ సినిమాలోని ‘స్కూల్ సాంగ్’ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీకర్ మాట్లాడుతూ.. “మా సినిమాకు ఒకే ఒక్క హీరో ప్రొడ్యూసర్ ధీరజ్. ఆయన వల్లే ఈ పాటను ఇంత గొప్పగా చేయగలిగాం. మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ ఈ పాటకు బ్యూటిపుల్ ట్యూన్ ఇచ్చారు.

సందీప్ మాస్టర్ తన కొరియోగ్రఫీతో మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. పిల్లల్ని, పెద్దల్ని ఆకట్టుకునేలా మా మూవీ త్వరలోనే మీ ముందుకు రాబోతోంది” అన్నారు. నిర్మాత ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ.. “నేను స్టార్స్‌తో సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. కానీ నాకు ఈ పిల్లలతో సినిమా చేస్తున్నప్పుడు ఎక్కువ సంతోషం, సంతృప్తి కలిగాయి. ఇప్పుడు సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఈ టైమ్‌లో బాక్సాఫీస్ దగ్గర పోటీకి దిగే జానర్ మూవీ కాదిది.

ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ ప్లాన్ చేయబోతున్నాం” అని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి మాట్లాడుతూ.. “పిల్లలతో ఒక పూర్తి పాట పాడించాలనేది నా డ్రీమ్. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. సింగర్ విశ్వదత్తా ఈ పాటను ఎంతో అందంగా పాడాడు. అతనికి తొలి పాట ఇది. ఈ పాటకు కొరియోగ్రఫీ చాలా ఇంపార్టెంట్. సందీప్ మంచి హుక్ స్టెప్స్ ఇచ్చారు. ఈ సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది” అన్నారు. సింగర్ విశ్వదత్తా, కొరియోగ్రాఫర్ ఆట సందీప్, నటి వాసుకి, చైల్ ఆర్టిస్ట్ అరుణ్ కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.