ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
24-04-2026 02:48 PM
* ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి భాగస్వామ్యులు కండి
గరిడేపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జడ్పిహెచ్ఎస్ హెచ్ఎం సువర్ణ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కీతవారిగూడెం గ్రామంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తులు మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలను కల్పిస్తుందని ఆమె తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.






