24 August, 2026 | 11:27 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

ప్రొఫెసర్‌ జయశంకర్‌ సేవలు చిరస్మరణీయం

21-06-2025 11:14 PM

కాల్వ శ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి

పెద్దపల్లి (విజయక్రాంతి): ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్ సేవలు చిరస్మరణీయమని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటులో జయశంకర్‌ పాత్ర మరులేమని జయశంకర్‌ తుదిశ్వాస విడిచే వరకు తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేశారని ఆయన ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యువకులందరూ జయశంకర్ సార్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు.