ప్రభుత్వ బడి భవనం ప్రారంభం
హాజరైన మేయర్ విజయలక్ష్మి
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 21 (విజయక్రాంతి): బంజారాహిల్స్ రోడ్ నం 12లోని ఎన్బీటీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో రూ.1.16 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ బడిని, అదనపు గదులను శనివారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. రెండేళ్ల క్రితం మన ఊరు-మనబడి పథకం కింద ప్రారంభించిన ఈ భవన నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ మేయర్ చొరవతో అప్పటి రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు రూ.20 లక్షల ఎంపీ ల్యాడ్స్ అందించారు.
మన ఊరుటీ పథకం కింద రూ. 48.45 లక్షలు, సర్వశిక్షా అభియాన్ కింద రూ.26 లక్షలు, అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్ కింద రూ.22.40 లక్షలు మంజూరు కాగా ఈ మొత్తం నిధులతో స్కూల్ భవనా న్ని పూర్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ప్ర స్తుతం ఉన్న తరగతులకు అదనంగా 2 గదులతో పాటు విద్యార్థుల కోసం డైనింగ్ హాల్ తదితర వసతులను కొత్త భవనంలో కల్పించామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు.
శనివారం పాఠశాల భవనాన్ని ఎమ్మె ల్సీ అద్దంకి దయాకర్‌తో కలిసి ప్రారంభించారు. త్వరలో ఇంటర్మీడియట్ కోసం భవ నం నిర్మిస్తామని మేయర్ తెలిపారు. అద్దంకి దయాకర్ కూడా ఇంటర్మీడియట్ భవనం నిర్మించడంలో సహకరిస్తామని తెలిపారు. అనంతరం విద్యార్థుల తో కలిసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. పిల్లలకి పుస్తకాలు పంపిణీ చేశారు.






