21-02-2026 12:00:00 AM
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
ముషీరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): మారుతున్న పరిస్థితులకు అనుగు ణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వ్యవసాయ రంగంలో నూతన పద్ధతు ల ద్వారా పంటలు పండించాలని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రైతులకు సూచించారు. శుక్రవారం రైతుబడి ఆద్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఆగ్రిషో (వసాయ ప్రదర్శన) ముఖ్య అతిదిగా గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరై ప్రారంబించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్రెడ్డి, తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరే షన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, మాజీ ఎమ్మె ల్యే నంద్యాల నర్సింహా రెడ్డి, రైతుబడి వ్యవస్థాపకులు రాజేందర్ రెడ్డి, ఆదర్శ రైతులు తుమ్మల యుగేందర్, పాశం రాంరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తనతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బతకాలనే మంచి మనస్సుతో దేశ వ్యా ప్తంగా రైతులు ఉన్నారన్నారు. వ్యవసాయం చేస్తే నష్టాలు వస్తాయనే మాటలు తప్పని అన్నారు.
సరైన పద్దతిలో ఆధునిక యం త్రాల సహకారంతో వ్యవసాయం చేస్తే లాభసాటిగా ఉంటుందన్నారు. దేశంలో వ్యవసా య రంగానికి డిమాండ్ ఉందని యువత వ్యవసాయ రంగంపై ఆసక్తి చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతాంగానికి మేలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం రైతు బడి వ్యవస్థాపకులు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులను పరిచయం చేయడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశ్యమన్నారు.
రైతు బడి కార్యక్రమంలో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, చత్తీష్ ఘ డ్ రాష్ట్రాలకు చెందిన రైతులు పాల్గొని వారి అవసరాలకు తగిన సమాచారాన్ని తెలుసుకున్నారు. విత్తనాలు, ఎరువులు, డ్రోన్లు, ఆర్వెస్టర్లు, డాక్టర్లు తదితర ఆధ నాతన పద్ధతులకు సంబందించిన దాదాపు 200 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ స్టాళ్లను సందర్శించి రైతులు వ్యవసాయంలో మెలుకువలు పొందాలని రైతులకు పిలుపుని చ్చారు.
అనంతరం ప్రతిభ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రైతుబడి అగ్రిషో లో ప్రతిభ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఒక స్టాల్ ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కారక్రమంలో వివిద రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.