22 May, 2026 | 12:59 AM

మియాపూర్‌లో ఐదుగురు మృతి కేసులో పురోగతి

22-08-2025 02:08 PM

ఎలుకల మందు కలుపుకుని తిన్నట్లు గుర్తింపు.

హైదరాబాద్: మియాపూర్(Miyapur)లో ఐదుగురు అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆహారంలో ఎలుకల మందు కలుపుకొని తిన్నట్లు గుర్తించారు. ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మియాపూర్ పోలీసులు ఆహార నమూనాలు పరీక్షలకు పంపారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ పెద్ద అనారోగ్యం కూడా కారణంగా భావిస్తున్నారు.

హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు అనుమానాస్పద స్థితిలో వారి ఇంట్లో మృతి చెందిన సంఘటన గురువారం నాడు స్థానికంగా ఆందోళన కలిగించింది. మక్త మహబూబ్‌పేట కాలనీలో జరిగిన ఈ సంఘటనలో మృతులను ఉప్పరి లక్ష్మయ్య (60), ఆయన భార్య ఉప్పరి వెంకటమ్మ (55), వారి కుమార్తె కవిత (24), అల్లుడు అనిల్ (32), వారి రెండేళ్ల మనవడు అప్పుగా గుర్తించారు. మియాపూర్ పోలీసులు, క్లూస్ టీం సహాయంతో సంఘటనా స్థలానికి చేరుకుని వివరణాత్మక దర్యాప్తు ప్రారంభించారు.