23-08-2025 12:49:54 AM
గజ్వేల్, ఆగస్టు 12: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాతే, చర్యలు తీసుకుంటామని రాష్ట్రప్రభుత్వం శుక్రవారం అడ్వొకేట్ జనరల్ ద్వారా హైకోర్టుకు తేల్చిచెప్పింది. న్యాయస్థానం దీంతో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
దీంతో ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఎర్రవల్లిలోని పార్టీ అధినేత కేసీఆర్ ఫాం హౌస్‌కు చేరుకున్నారు. ఒకవేళ అసెంబ్లీలో కమిషన్ నివేదిక ప్రవేశపెడితే, అనుసరించాల్సిన విధానాలు, ఎత్తుగడలపై కేసీఆర్‌తో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. బీఆర్‌ఎస్ నేతల ఆకస్మిక భేటీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.