27 May, 2026 | 2:03 AM

ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి

27-05-2026 01:01 AM
  1. అడ్డంకులను అధిగమించేందుకు కార్యాచరణ  
  2. మంత్రి జూపల్లి కృష్ణారావు

నాగర్‌కర్నూల్, మే 26(విజయక్రాంతి): నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని, భూ సేకరణ పనులను రానున్న వారం రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం నాగర్ కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏదుల, నార్లపూర్, వటేం 8వ ప్యాకేజ్ పంప్ హౌస్, సంప్ హౌస్, ఓపెన్ కెనాల్ పనులను ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్‌తో కలిసి మంత్రి పరిశీలించారు.

అనంతరం వట్టెం పంప్ హౌస్ గెస్ట్ హౌస్‌లో నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో కొనసాగుతున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల కేఎల్‌ఐ, డిండి, ఉమామహేశ్వరం బాలెన్సింగ్ రిజర్వాయర్, అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్, మార్కండేయ రిజర్వాయర్, కర్ణేతాండ్రా బాలెన్సింగ్ రిజర్వాయర్‌లతో పాటు వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, భూ సేకరణ పనుల పురోగతిపై మంత్రి జూపల్లి కృష్ణారావు సమగ్ర సమీక్ష నిర్వహించారు.

రైతులకు సాగునీరు అందించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రతి పనిని గడువులోపు పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు.ముఖ్యంగా భూ సేకరణ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి జిల్లా లోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల సందర్శనకు సీఎం రేవంత్‌రెడ్డి రానున్నట్లు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే ప్రధాన సమస్యల పరిష్కారానికి కావాల్సిన అనుమతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఇరిగేషన్ శాఖల అధికారులను ఆదేశించారు.

సమావేశంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్, వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ అమరేందర్,ఇరిగేషన్ శాఖల అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయ్యాయని బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం