గ్రామాల్లో సామాజిక మార్పే లక్ష్యం
అహ్మదీపూర్‌లో ‘మన పోలీస్ మన ఊరు’
అహ్మదీపూర్‌లో సీసీ టీవీలు పారంభించిన సీపీ రష్మి పెరుమాల్
గజ్వేల్, మే 26: గ్రామాల్లో సామాజిక మార్పే లక్ష్యమని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ప్రజలకు, పోలీసులకు మధ్య దూరాన్ని తగ్గించడమే ’మన పోలీస్ మన ఊరు’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ’సిద్దిపేట సురక్ష నేత్ర’లో భాగంగా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన 25 సీసీటీవీ కెమెరాలు, 14 మైకులతో కూడిన ఆడియో కనెక్టివిటీ వ్యవస్థను ఆమెప్రారంభించారు.
అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి, వృద్ధులకు చేతికర్రలు పంపిణీ చేశారు. యువకులు, పోలీసుల మధ్య వాలీబాల్ మ్యాచ్‌కు టాస్ వేశారు. యాంటీ డ్రగ్స్, రోడ్డు భద్రతపై ప్రత్యేక వీడియోలు ప్రదర్శించగా, ఒగ్గు కళాకారులు జానపద రూపంలో ట్రాఫిక్ నిబంధనలు, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించా రు. గజ్వేల్ ఏసీపీ నర్సింలు, సీఐ రవికుమార్, పోలీస్ అధికారులు, గ్రామ సర్పంచ్ బ్యాగరి ప్రభాకర్, పెద్దలు ఆకుల రాజయ్య, మాదాసుశ్రీనివాస్, పాల్గొన్నారు.






