16 April, 2026 | 10:56 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఆర్‌అండ్‌బీలో పదోన్నతుల జాతర

28-06-2025 01:48 AM

72 మంది డీఈఈలకు పదోన్నతి

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): ఆర్‌అండ్‌బీ శాఖలో పదోన్నతుల జాతర సాగుతోంది. ఇప్పటికే ఏఈ నుంచి ఏఈఈ, ఏఈఈ నుంచి డీఈఈగా పదోన్నతులు ఇచ్చిన ప్రభుత్వం తాజాగా డీఈఈలకు ఈఈలుగా పదోన్నతలు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. 72 మందికి డీఈఈ నుంచి ఈఈలుగా పదోన్నతులు రాగా... శుక్రవారం అందు లో 64 మందికి పోస్టింగులు సైతం ఇచ్చారు.

మిగతా ఏ శాఖలోనూ లేని విధంగా ఆర్‌అండ్‌బీలో పదోన్నతులు అందిస్తూ ఇంజనీర్లకు ప్రోత్సాహం అందిస్తున్నామని ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. ఒక్క రోజే 64 మంది డిప్యూటీ ఇంజనీర్లకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా ప్రమోషన్‌తో పాటు పోస్టింగ్ కూడా ఇవ్వడం చారిత్రాత్మకమన్నారు.

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని సడలింపులు ఇచ్చి మరీ ప్రమోషన్స్, బదిలీలు చేయడంపై ఇంజనీర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి సూచనల మేరకు ప్రజల్లో మన్ననలు పొందేలా పని చేస్తామన్న ఇంజనీర్లు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.