calender_icon.png 12 July, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో డ్రగ్స్ కాంట్రాక్ట్ తీసుకున్న కేటీఆర్

28-06-2025 01:50:01 AM

పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం 

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి) : తెలంగాణలో మాజీ మం త్రి కేటీఆరే డ్రగ్స్‌ను కాంట్రాక్ట్ తీసుకున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం ఆరోపించారు. ఇతర దేశాల నుంచి తెలంగాణకు డ్రగ్స్ తీసుకొచ్చారని ఆరోపించారు.

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రూ. 10 వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్‌ను వేయి మందితో తెలంగాణలోని పట్టణా లు, గ్రామాల్లో  సరఫరా చేశారని ఆ యన విమర్శించారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీల కుటుంబాలను కేటీఆర్ సర్వనాశనం చేశారని, ఎంతో మంది యువత డ్రగ్స్‌కు బానిసై చనిపోయారని దుయ్యబట్టారు. 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో డ్రగ్స్ అనేవే లేవని 2014 తర్వాత బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాకనే రాష్ట్రంలో యు వతకు డ్రగ్స్ అలవాటయ్యాయని ఆరోపించారు.