ధర్మపురి పోలీస్ స్టేషన్‌లో స్వచ్ఛభారత్
సీఐ రాం నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం
ధర్మపురి, మార్చి17(విజయక్రాంతి): 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా ధర్మపురి పోలీస్ స్టేషన్ లో మంగళవారం స్వచ్ఛ భా రత్ కార్యక్రమం ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాం నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్త్స్ర జి.మ హేష్ నిర్వహించారు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ధర్మపురి పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బంది అందరూ కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా సీఐ నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ కూడా తమ తమ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలని దానిద్వారా అనారోగ్యాన్ని దూరం చేయవచ్చని తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం ఉంటుందనీ ప్రతీ ఒక్కరూ పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొం టూ స్వచ్ఛ భారత్ కు కృషి చేయాలనీ ఆయన పిలుపునిచ్చారు.




