సబ్జెక్ట్ వైజ్‌గా పదోన్నతులు కల్పించాలి
28-06-2024 12:22 AM
ప్రభుత్వానికి హెచ్‌ఎం సంఘం వినతి
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): ప్రస్తుతం నిర్వహిస్తున్న పదో న్నతుల ప్రక్రియలో ఎక్కువ మంది టీచర్లు నిరాశకు గురవుతున్నారని గెజిటెడ్ ప్రదానోపాధ్యాయుల సం ఘం రాష్ట్ర అధ్యక్షులు పి.రాజభాను చంద్రప్రకాష్ తెలిపారు. ఎస్జీటీ నుం డి స్కూల్ అసిస్టెంట్ స్థాయికి ఇచ్చే ప్రమోషన్స్ అన్ని ఒకేసారి నిర్వహించడంతో ఒక్కొక్కరికి రెండు మూడు ప్రమోషన్స్ వస్తుండటంతో ఆ టీచర్ ఏదోక ప్రమోషన్ ఎంచుకొంటున్నారని, దీంతో ఒకటి లేదా రెండు పోస్టులు ఖాళీగా ఉండడం అంతేకాకుండా, మిగతా వారికి పదోన్నతులు లభించక నష్టం జరుగుతోందని ఒక ప్రకటనలో తెలిపారు.






