21 April, 2026 | 11:43 PM

జేటీసీపై దాడి సరికాదు: పొన్నం

28-06-2024 12:20 AM

హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేష్‌పై జరిగిన దాడిని రవాణా శాఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఏమైనా ఇబ్బంది ఉంటే ఫిర్యాదు చేసుకోవాలని కానీ, అధికారులపై దాడులు ఆక్షేపనీయమన్నారు. ఉద్యోగులపై దాడులు సరికా దని, ఉద్యోగులకు అండగా ఉంటామని  పేర్కొన్నారు. జరిగిన ఘటనపై పోలీస్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుం డా చూడాలని ఆదేశించారు. ఉద్యోగులు అధైర్యపడొద్దని, అండగా ఉం టామని మంత్రి హామీ ఇచ్చారు.