11-11-2025 12:00:00 AM
ధర్మపురి, నవంబర్ 10 (విజయక్రాంతి): ప్రభుత్వం ఎంత చెప్తున్నా.. పోలీసులు, అధికారులు ఎన్ని హెచ్చరిక ప్రకటనలు చేస్తున్నా ఇసుక మాఫియా తగ్గేదే లేదు అన్నట్టు వ్యవహరిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులు దెబ్బ తినేలా ఇసుకాసురులు వాగులను గుల్ల చేస్తున్నారు. ప్రజలు ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటంతో ఇసుక అక్రమ రవాణా మూడు లారీలు.. ఆరు ట్రాక్టర్లుగా నడుస్తున్నది. జగిత్యాల జిల్లా ధర్మపురి ని యోజకవర్గంలో నిత్యం వందల ట్రాక్టర్లతో సహజ వనరుల దోపిడీ జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎండపల్లి కేంద్రంగా
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో నిత్యం వందలాది ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణ జరుగుతుంది. పగలు రాత్రీ తేడా లేకుండా ఇసుక రవాణ చేస్తూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. వందలాది ట్రా క్టర్లతో ఎండపల్లి మండలం మీదుగా రవాణా కొనసాగిస్తూ ఆయా గ్రామాలలోని ప్రజలను వాయు, శబ్దకాలుష్యాలతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
కంటితుడుపు చర్యలు!
ఎండపల్లి కేంద్రంగా భారీ ఇసుక దందా నడుస్తున్నప్పటికీ సంబంధిత అధికారుల చ ర్యలు మాత్రం తూతూ మంత్రంగానే కొనసాగుతున్నాయి. ప్రతీరోజు నిత్యం పదుల సంఖ్యల ట్రాక్టర్లతో అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్నప్పటికీ అధికారులు కంటి తు డుపు చర్యలు తీసుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. అధికారులకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా అనే కోణంలో మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.
తలుచుకుంటే చెక్ పెట్టొచ్చు ఇలా..
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంతోపాటు వెంనూర్ గ్రామాల నుంచి వచ్చే అక్రమ రవాణాను శానబండ, పాతగూడూర్, గొడిసెలపేట గ్రామాలలో చెక్పోస్ట్లు పెట్టి అడ్డుకట్ట వెయ్యొచ్చు. రెవెన్యూ శాఖలో తాజాగా జీపీవోల నియామకoతో అధికారుల సంఖ్యా బలం పెరిగినందున అక్రమ ఇసుక దందాకు చెక్ పెట్టడం అధికారులకు పెద్ద కష్టతరమేమి కాదు.
అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం
ఎండపల్లి మండల కేంద్రంగా కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణాకు త ప్పకుండా అడ్డుకట్ట వేస్తాం. ఇప్పటికే పలు అక్రమఇసుక డంపులు సీజ్ చేసి వేలం వేశాం. అక్రమంగా ఇసుక రవా ణా చేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు. అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
అనిల్ కుమార్, తహసీల్దార్