9 April, 2026 | 8:39 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

న్యాయాన్ని కాపాడండి.. రిజర్వేషన్లు అమలు చేయండి

11-10-2025 12:00 AM

డాక్టర్ సంగని మల్లేశ్వర్, పాస్ రాష్ట్ర అధ్యక్షుడు 

కాకతీయ యూనివర్సిటీ, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : భారత రాజ్యాంగ  ప్రవేశిక ప్రజలందరికి సామాజిక,ఆర్థిక, రాజకీయ న్యాయం అందాలని ప్రవచించిన అత్యున్నత న్యాయ స్థానాల్లో నియమితులైన న్యాయమూర్తుల్లో సామాజిక న్యాయం కొరవడి  అట్టడుగు వర్గాలకు న్యాయం జరగడంలేదని ఫూలే ఆశయ సాధన సమితి అధ్యక్షులు (పాస్ ) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగాని మల్లేశ్వర్ అన్నారు.

ఈ రోజు కాకతీయ విశ్వవిద్యాలయం, దూరవిద్య కేంద్రం ప్రాంగణంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహానికి పూలమాల వేసి 42శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని వినతిపత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా పాస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని 38(1)వ అధికరణ ప్రజలందరి సంక్షేమాన్ని కోరిందని,78సంవత్సరాలుగా సామాజిక న్యాయం అందని ద్రాక్షగానే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేసారు.

తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగంలోని 285 (ఏ) సవరించి తెచ్చిన జీవో నెం ’9’ పై రెండు రోజులు వాదోపవాదనలు విని కొన్ని వర్గాలు మాత్రమే దైవాంశ సంభూతులుగా వర్ణించి,8శాతం లేని అగ్రవర్ణాలకు అనుకూలంగా హైకోర్టు ’స్టే’ ఇచ్చి బీసీలకు రాజ్యాధికారం దూరం చేసే ప్రయత్నం చేసిందని అన్నారు, బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్న రాజకీయ పార్టీలకు ప్రజాక్షేత్రంలో శిక్షించే రోజులు దగ్గరపడ్డాయని మండిపడ్డారు.

ఇప్పటికైనా గవర్నర్ ను ఒప్పించే బాధ్యత బీజేపీ తీసుకోని,రిజర్వేషన్ల అమలుకు సహకరించాలని విజ్ణప్తి చేసారు. ఈ కార్యక్రమంలో పాస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ తాడూరి శాస్త్రి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చందా మల్లయ్య, జిల్లా కార్యదర్శి డాక్టర్ నల్లాని శ్రీనివాస్,పాస్ నాయకులు రుద్రోజు శ్యాం సుందర్, కర్ణకంటి సత్యనారాయణ, గుడాటి విజయ్ తదితరులు పాల్గొన్నారు .