calender_icon.png 11 October, 2025 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడుపాయలలో టీజీవో సమావేశం

11-10-2025 12:00:00 AM

కేంద్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా శేషుప్రసాద్

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయ క్రాంతి): తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసి యేషన్ కేంద్ర కార్యవర్గ సమావేశం మెదక్ జిల్లా ఏడుపాయలలో శుక్రవారం రాష్ట్ర అధ్య క్షుడు ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరి గింది. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా తెలం గాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ మాజీ జిల్లా కోశాధికారి కొండపల్లి శేషు ప్రసాద్‌ను టీజీవో కేంద్ర సంఘ కార్యవర్గంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఎంపిక చేశారు.

శేషుప్రసాద్‌కు టీజీవో ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కొం గర వెంకటేశ్వరరావు, మోదుగు వేలాద్రి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యవర్గ సమావేశానికి ఖమ్మం జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు మల్లెల రవీంద్రప్రసాద్, జిల్లా కోశాధికారి సూరంపల్లి రాంబాబు హాజరైనారు.