6 May, 2026 | 5:18 PM

టీటీడీ ఆస్తులను రక్షించండి

28-11-2024 01:41 AM

టీటీడీ చైర్మన్‌కు వినతి

ఖమ్మం, నవంబర్ 27 (విజయక్రాంతి): ఖమ్మంలోని టీటీడీ కళ్యాణ మండపానికి సంబంధించిన కోట్లాది రూపాయల విలువైన స్థలం అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడని ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నేరెళ్ల శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు, టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్లపూడి రామారావు, పసుపులేటి శ్రీనివాస్, దిలీప్‌చౌదరి ఆరోపించారు.

కళ్యాణమండపంపై హైకోర్టు లో కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ నగర పాలక సంస్థ అధికారులు తాజాగా శ్వాశ్వత నిర్మాణాలకు సిద్ధమవుతున్నారని చెప్పారు. దీంతో వారు బృందం బుధవారం హైదరాబాద్‌లో టీటీడీ చైర్మన్  బీఆర్ నా యుడును కలిసి, ఈ భూములను దురాక్రమణ నుంచి కాపాడాలని వినతిపత్రాన్ని అందజేశారు. ఈ మేరకు బీఆర్ నాయుడు హామీ ఇచ్చారని వారు తెలిపారు.