calender_icon.png 16 September, 2025 | 8:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుటుంబ సభ్యుల ఆగడాల నుండి రక్షించండి..!

16-09-2025 06:05:43 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): తమ కుటుంబ సభ్యుల కాగడాల నుండి తమ కుటుంబాన్ని కాపాడాలని భీమిని మండలం మల్లిడి గ్రామపంచాయతీ దుబ్బ గూడెం గ్రామానికి చెందిన తండ్రి, కొడుకులు పెద్దపల్లి వెంకటేశం, పెద్దపల్లి ప్రశాంత్ ను పోలీసులను వేడుకుంటున్నారు. మంగళవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే నంబర్ 48 లో 30 ఏళ్లుగా సాగు చేస్తున్న తమ రెండెకరాల లావాని పట్టా భూమిలో తమ పెదనాన్నలు పెద్దపల్లి శంకరి, పెద్దపల్లి రామయ్య, పాలోల్లైన అన్నదమ్ములు పెద్దపల్లి నగేష్, పెద్దపల్లి సురేష్, పెద్దపల్లి గణేష్ లు దౌర్జన్యంగా వచ్చి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంలో అనేకసార్లు అప్పటి భీమిని ఎస్సై వెంకటేశ్వర్లుకు ఫిర్యాదు చేసిన పట్టించుకోక పొగా తనపైనే రౌడీషీట్ పెట్టారని పెద్దపల్లి ప్రశాంత్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమే బెల్లంపల్లిలో ఏసీపీని సంప్రదిస్తే తనపై ఆరు కేసులు పెట్టినట్లు తెలిసిందన్నారు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టినట్లు పెద్దపల్లి ప్రశాంత్ ఆరోపించారు. తన తాత ఉమ్మడి వారసత్వంగా సంక్రమించిన భూమిలో పంపకాలు కాకుండానే ఇంటి నిర్మాణం చేపడుతుంటే అడ్డుకోబోయిన తనపై దాడి చేసి గాయపరిచారని తెలిపారు. తాను పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా భీమిని ఆసుపత్రిలో చికిత్స చేశారని తెలిపారు. తాను ఎన్నిసార్లు పోలీసులను న్యాయం కోసం వేడుకున్న పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తలపై దాడి చేసిన తన పెదనాన్న పెద్దపల్లి శంకర్ అతని కుమారులు పెద్దపల్లి నగేష్, పెద్దపల్లి సురేష్, పెద్దపల్లి గణేష్ లపై పోలీసులు చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. సర్వేనెంబర్ 46 లో గల తమ వ్యవసాయ భూమిలో తాము వేసుకున్న పత్తి చేనుపై ఒక పెదనాన్న పెద్దపల్లి శంకర్, అతని కుమారుడు పెద్దపల్లి గణేష్ లు గడ్డి మందు పిచికారి చేయడంతో పత్తి పంట నష్టపోయానని ఈ విషయంలో పోలీసులు తగు విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకొని తమ కుటుంబానికి న్యాయం చేయాలని పెద్దపల్లి ప్రశాంత్, అతని తండ్రి పెద్దపల్లి వెంకటేశం లు వేడుకున్నారు.