16-09-2025 06:12:33 PM
నిర్మల్,(విజయక్రాంతి): విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీఎస్ ఎస్టియు జిల్లా అధ్యక్షులు భూమున యాదవ్ రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల గజేందర్ అన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలో పట్టణ కమిటీని ప్రకటించి నూతన కమిటీ నీ సన్మానం చేశారు. తెలంగాణ ఎస్టియు సంఘం విద్యారంగ సమస్యలతో పాటు ఉపాధ్యాయ రంగ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలను బలపితం చేయాలని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు జి.లక్ష్మణ్ వెంకటేశ్వర్లు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.