16-09-2025 05:53:35 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ రూరల్ మండలం తల్వేద గ్రామంలో ఇర్ల జంగన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం డాక్టర్ రాం రెడ్డి ఐ కేర్ సహకారంతో వైద్యులు గ్రామస్తులకు ఉచిత కంటి వైద్య పరీక్ష శిబిరం నిర్వహించారు. కంటి వైద్యులు గ్రామస్తులను పరీక్షించి టీకాలు ,అద్దాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. అనంతరం వైద్య బృందాన్ని శాలువాతో సత్కరించారు.