2 March, 2026 | 4:39 AM

ప్రకృతి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

02-03-2026 12:00 AM

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ 

మహబూబాబాద్ మార్చి 1 (విజయక్రాంతి): ప్రకృతి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వృక్షాలుగా ఎదిగేందుకు కృషి చేయాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ పిలుపునిచ్చారు. ప్రకృతిని కాపాడాలనే మహత్తర లక్ష్యంతో మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో విశ్వ మిత్ర చౌహాన్ చేపట్టిన ‘రోజుకు ఒక మొక్క’ నాటే కార్యక్రమంలో భాగంగా ఆదివారం గుడూరు లోని తన నివాసంలో  హుస్సేన్ నాయక్  మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ‘వృక్షో రక్షతి రక్షితః’ అనే సూత్రాన్ని ఆచరణలో పెట్టి ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్క నాటి, దాన్ని సంరక్షించాలని పిలుపునిచ్చారు.