23 August, 2026 | 6:43 PM

Breaking News

బాన్సువాడలో ప్లాస్టిక్‌ నిషేధం అమలయ్యేనా...? యథేచ్ఛగా వినియోగం   •   గురుస్వామి బోనకుర్తి అర్జున్‎కి ప్రత్యేక గురు పురస్కారం   •   తండాలకు రోడ్డు మోక్షం ఎప్పుడు..!   •   రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘం అభివృద్ధికి కృషి   •   బీర్కూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా బోయిని శంకర్   •   లక్ష్మిపూర్‎లో చోరీ రూ. 3లక్షలు విలువైన వస్తువుల అపహరణ   •   మిత్రుడి వైద్య చికిత్సకు మల్లంపేట్ పెద్దల ఆర్థిక సహాయం   •   నడిరోడ్డుపై గుంత ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు   •   జర్నలిస్టుల ఇళ్ల స్థలాల వివాదాన్ని వెంటనే పరిష్కరించాలి   •   చుక్కల్లో.. చక్కెర... ! కిలో 70కి చేరిన చక్కర ధర   •  

ఉగ్రదాడి నిరసిస్తూ నిరసన..

25-04-2025 04:33 PM

నిర్మల్ (విజయక్రాంతి): జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు మైనార్టీ నాయకులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జున్ మత్ అలీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మసీదు వద్ద ఉగ్రదాడిని నిరసిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశంలో ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు ఉగ్రవాదులు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని అటువంటి వారిని ప్రభుత్వం పట్టుకొని కఠినంగా శిక్షించాలని గ్రంథాలయ చైర్మన్ తెలిపారు. దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.