16 April, 2026 | 11:21 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఉగ్రదాడికి న్యాయవాదుల నిరసన

25-04-2025 04:36 PM

భైంసా (విజయక్రాంతి): జమ్మూకాశ్మీర్ పర్యాటక ప్రాంతాల్లో అమాయక ప్రజలపై ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని భైంసా కోర్టు బార్ అధ్యక్షుడు సి శంకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఉగ్రదాడిని నిరసిస్తూ కోర్టు ఆవరణ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి పట్టణంలో ప్రధాన రహదారిపై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి దుస్సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలకు శాంతి కలిగించాలని కోరుతూ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.