20 August, 2026 | 2:44 AM

ఆర్జేడీ కన్నెర్ర

20-08-2026 01:48 AM

విద్యార్థుల ఆందోళనలో ‘ఏకే- వినియోగంపై నిరసన

పాట్నాలో లోక్‌భవన్‌కు మార్చ్

నకిలీ ఏకే- గన్‌లతో నిరసనకారుల ఆందోళన

నిరసనకారులపై పోలీసుల వాటర్ క్యానన్ల ప్రయోగం

పాట్నా, ఆగస్టు 19: నీట్ లీక్ వివాదంపై బీహార్‌లో విద్యార్థుల నిరసన సందర్భంగా ఒక పోలీస్ ఏకే-47తో కాల్పులు జరుపడంపై ఆర్జేడీ కన్నెర్ర చేసింది. ఆ పార్టీ బుధవారం నిర్వహించిన ‘లోక్ భవన్ మార్చ్’ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీలో నకిలీ ఏకే-47 గన్‌ను పట్టుకుని ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. లోక్‌భవన్ ముట్టడికి వెళ్తున్న నిరసనకారులపై పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయో గించారు. ఈ ర్యాలీకి నేతృత్వం వహించిన ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ను అరెస్ట్ చేశారు.

సీఎం సామ్రాట్ చౌదరి ఆదేశాల మేరకే వా టర్ క్యానన్లను ప్రయోగించారని ఆరోపించారు. ప్రజలు మేల్కొన్నారని, ఇలాంటి చర్యలతో ఉద్యమాన్ని ఆపలేరని స్పష్టం చేశారు. గత నెలలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద సీ జేపీ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసనకు మద్దతుగా పాట్నాలో విద్యార్థుల నిరస నలు కొన సాగాయి. అయితే జూలై 25న సివాన్ జిల్లాలో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఏకే-47తో నిరసనకారులపై కాల్పులు జరిపిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బుధవారం ‘రా జ్ భవన్ మార్చ్’కు ప్రతిపక్ష ఆర్జేడీ పిలుపుని చ్చింది. ఈ ర్యాలీకి తేజస్వీయాదవ్ నేతృత్వం వ హించారు. జేపీ గోల్‌అంబర్ వద్ద పెద్ద సంఖ్యలో ఆర్జేడీ కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సమావేశమయ్యా రు. అనంతరం రాజ్‌భవన్‌వైపు మార్చ్ గా బయలు దేరారు. ఈ సందర్భంగా ఐదువేల మంది మద్దతుదా రులతో చేపట్టిన పాదయాత్ర ఐదు కిలోమీటర్లు కొనసాగగా తేజ స్విని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, తేజస్వి, మద్దతుదారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.  నిరసనకారులపై పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయో గించి చెదర గొట్టి తేజస్విని అరెస్టు చేశారు. 

ఆ తర్వా త ఆయనను విడిచిపెట్టారు. నిరసన సందర్భంగా బొమ్మ ఏకే చేతబూని కా ర్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ పాదయాత్రలో ఆర్జేడీ ఎంపీ మీసా భారతి కూడా పాల్గొన్నారు. బీహార్‌లో పేపర్ లీకులు, నిరు ద్యోగం, విద్యార్థులు, యువత ఎదుర్కొంటు న్న సమస్యలను లేవనెత్తారు. ‘విద్యార్థులపై ఏకే 47 ప్రయోగించినట్లు బీహార్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అంగీకరించిందని మేం వి న్నాం. నిరసనలో ఏకే 47 వాడకానికి ఎవరు అనుమతి ఇచ్చారని బీహార్ ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది’ అని ఆమె అన్నా రు.

గత నెలలో పాట్నా సమీంలోని సివాన్ లో వి ద్యార్థుల నిరసనల సమయంలో పోలీస్ కానిస్టేబుల్ అభిషేక్ కుమార్ ఏకే-47తో కాల్పులు జరుపడంపై తీవ్ర విమర్శ లు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆ కానిస్టేబుల్‌ను బీహార్ ప్రభుత్వం సస్పెండ్ చేసిం ది. అలాగే సివాన్, భోజ్‌పూర్ జిల్లాల ఎస్పీలను బదిలీ చేసింది. సివాన్ ఎస్పీ పూరన్ కుమా ర్ ఝా పర్యవేక్షణలో ఏకే-47 రైఫిల్‌ను విని యోగించినట్లు ఆరోపణలు రావడంతో కొత్త పోస్టింగ్ కోసం ఆయనను వెయిటింగ్ లిస్ట్‌లో ఉంచారు.

ఉద్యమాన్ని ఆపలేరు : తేజస్వీయాదవ్ 

తేజస్వీయాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, జైలుకు వెళ్లేందుకు కూడా భయపడబోమని స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కులు, నిరుద్యోగ నిర్మూలన, పరీక్షాపత్రాల లీకేజీల అరికట్టడం, పరీక్షలలో పారదర్శకత కోసం ఎల్లప్పుడూ గళమెత్తుతామని చెప్పారు. ఇదంతా సీఎం సామ్రాట్ చౌదరి ఆదేశాల మేరకే జరుగుతోంది. దీనివల్ల (వాటర్ క్యానన్ల ప్రయోగం వల్ల) ఎలాంటి మార్పూ ఉండదు. ప్రజలు చైతన్యవంతులై వీధుల్లోకి వచ్చారు. ఇక ప్రభుత్వం తలొగ్గక తప్పదు. ఇలాంటి ఎత్తుగడలు పని చేయవు అని ఆయన అన్నారు.