3 May, 2026 | 7:37 PM

ఫీజుల కోసం 15న దీక్ష

11-03-2026 01:12 AM
  1. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహణ

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

ముషీరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ విద్యా ర్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికా రంలోకి వచ్చిన రెండు సంవత్సరాల పరిపాలనలో ఎవరెవరికి ఎంత నిధులు ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, ఈ బడ్జెట్‌లో ఫీజులకు పదివేల కోట్లు కేటాయించాలని కోరారు. ఈ డిమాండ్‌తో ఈ నెల 15ప ఇందిరాపార్క్ వద్ద ఫీజు పోరు దీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు.

దీక్ష పోస్టర్‌ను బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్, జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రంగౌడ్‌లతో కలిసి జాజుల ఆవిష్క రించారు. సమావేశంలో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్, బీసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తారకేశ్వరి, ఉపాధ్యక్షురాలు సంధ్యారాణి, గూడూరు భాస్కర్ మేరు, సత్యం గౌడ్, ఇంద్రమ్ రజక, అనంతుల పవన్ సాయి కుమార్, బండి గారి రాజు, అనంతొజు బ్రహ్మచారి, గోద రవీందర్ రేణుక, విజయలక్ష్మి, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.