1 September, 2026 | 10:42 PM

ఓపీఎస్‌ కోసం ఉద్యోగుల గళం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన

01-09-2026 | 09:51pm

నాగల్‌గిద్ద,(విజయక్రాంతి): పెన్షన్‌ విద్రోహ దినోత్సవం(Pension Rebellion Day) సందర్భంగా టీజీ ఈజేఏసీ, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు నాగల్‌గిద్ద మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు. టీఎన్జీవో వైస్‌ ప్రెసిడెంట్‌ నారాయణఖేడ్‌ సంతోష్‌, మండల వ్యవసాయ అధికారి ప్రవీణ్‌చారి, మహిపాల్, చరణ్, ఉపాధ్యాయులు రాజ్‌కుమార్‌, సిద్ధంగార్‌ విజయ్‌కుమార్‌, శివశెట్టి, రాము తదితరులు పాల్గొన్నారు.

2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్‌ విధానం(ఓపీఎస్‌) అమలు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల భవిష్యత్‌ భద్రతకు ఓపీఎస్‌ ఎంతో అవసరమని పేర్కొన్నారు. అలాగే పీఆర్సీ గడువు దాటి మూడున్నరేళ్లు పూర్తయినందున 50 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే పీఆర్సీ అమలు చేయాలని, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్లను సానుకూలంగా పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.