3 April, 2026 | 3:00 AM

కరెంటోళ్ల.. పోరుబాట

03-04-2026 01:20 AM

ఉమ్మడి జిల్లాలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు 

సర్వీస్ రూల్స్, భద్రతపై డిమాండ్ 

ఉమ్మడి జిల్లాలో వెయ్యి మంది ఆర్టిజన్లు

నిర్మల్ ఏప్రిల్ 2 (విజయక్రాంతి) : సమాజానికి ప్రతినిత్యం వెలుగులు అందించే కరెంటుోల్లు వారి హక్కుల కోసం పోరు బాట పట్టారు. ఉమ్మడి జిల్లాలోని విద్యుత్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లు పీస్ వర్క్ కార్మికులు, ఆన్లైన్ మ్యాన్ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ప్రత్యేక కార్యాచరణతో నిరసనలను తెలుపుతున్నారు. కీళ్ల తరబడి సంస్థలు పనిచేస్తున్న తమకు తగిన గుర్తింపు బెనిఫిట్స్, ప్రభుత్వంలో విలీనం, అరులైన వారికి పదోన్నతులు, పీస్ వర్క్ కార్మికులకు కనీస వేతనాలు.

ఆర్టిజన్ కార్మికులకు ఏపీ ఎస్ ఈ బి రూల్స్ అమలు. పని భారం , పని భారం తగ్గింపు, తదితర డిమాండ్లతో ఉమ్మడి జిల్లాలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ ఎంప్లాయిస్ జెఎన్టి యాక్షన్ కమిటీ (టీవీ ఏ ఈ) జెసి ఆధ్వర్యంలో 9 సంఘాలు ఏకమై పోరుబాట చేస్తున్నాయి. జిల్లాలో నిర్మల్ మంచిరాల్ కొమరం అస్మాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో వీరి సంఖ్య వెయ్యికి పైగా ఉంటుందని చెప్తున్నారు.

ఇందులో ఆర్టిజన్ కార్మికులు 600, ఫీజు రేట్ కార్మికులు 300,  వర్కర్లు, ఆన్లైన్ వర్కర్లు 400 మంది విధులు నిర్వహిస్తున్నారు. మీరంతా విద్యుత్ శాఖలో సబ్ స్టేషన్ ఆపరేటర్లుగా. విద్యుత్ మరమ్మతు కాంట్రాక్టర్ గా, వాచ్మెన్ గా, విద్యుత్ పరికరాల సరఫరా సప్లై కార్మికులుగా కూలీలుగా, పనిచేస్తున్నారు, ప్రభుత్వం ఆర్టిజన్ కార్మికులకు నాలుగు 2018లో విద్యుత్ ఉద్యోగు లుగా గుర్తించినప్పటికీ విద్యుత్ ఉద్యోగులకు వర్తించే సర్వీస్ రూల్స్ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు 

ప్రధాన డిమాండ్లు ఇవే..

ఉమ్మడి జిల్లాలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ ఎంప్లాయిస్, ఆన్లైన్ డ్యూటీ కార్మికులు, పీస్ రేట్ కార్మికులు. ఔట్సోర్సింగ్ కార్మికులు ప్రతినిత్యం విధులు నిర్వహిస్తున్న వారికి పనికి తగ్గ పారితోషకం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టిజన్ కార్మికులకు రెగ్యులర్ చేసినప్పటికీ సర్వీసులు అమలు కావడం లేదని చెప్తున్నారు. విద్య అర్హతను బట్టి పదోన్నతులు కల్పించాలని పేర్కొన్నారు, పీస్ వర్క్ కార్మికులకు ఏ రోజు పని ఉంటే ఆ రోజుకు మట్టుకే కూలి దొరుకుతుందని పని లేకపోతే ఆదాయం ఉండడం లేదని కార్మికులు చెప్తున్నారు. ఆన్లైన్ కార్మికులను విద్యుత్ సంస్థల విలీనం చేయాలని కోరుతున్నారు.

పియాసిని అమలు చేయాలని పని భారం తగ్గించాలని వారు ప్రధాన డిమాండ్లతో దశల వారి పోరాటానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికి అన్ని జిల్లాల్లో జేఎస్గా ఏర్పడి జిల్లా సర్కిల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈనెల 4న ఖమ్మం కీడున వరంగల్ ఎంపీడీసీఎల్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి అప్పటికి స్పందించకపోతే సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సంఘం నేతలు తెలుపుతున్నారు. ఇప్పటికే వారు 2018లో, 2023లో రెండుసార్లు నిరసన తెలిపి ప్రభుత్వం తీసుకెళ్లగా కొన్ని సమస్యలు పరిష్కారంగా మరికొన్ని ప్రభుత్వ హామీగానే మిగిలిపోయినట్టు చెప్తున్నారు.

ఆర్టిజన్, ఆమ్ మ్యాన్, పీస్ వర్క్ పనిచేసే కార్మికులు ఒకవేళ సమ్మెకు వెళ్తే విద్యుత్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఒకవైపు మండుతున్న ఎండలు మరోవైపు విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పని చేస్తే వీరంతా ఆందోళన చేయడంతో ఈ సమస్యను సంబంధిత అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటికి పరిష్కార మార్గం చూపేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

కనీస వేతనం అమలు చేయాలి

కార్మిక జేసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మెకు తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ 114 327 టీఆర్‌వీకె తదితర సంఘాల నాయకులు సంపూర్ణ మద్దతు పలుకుతున్నా రు. విద్యుత్ శాఖలో తాము ఫీజు వర్క్ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నారు. విద్యుత్ శాఖలో విద్యుసర్ఫర సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ తాత్కాలికంగా కరెంటు నిలిపి మరమ్మత్తు పనులు చేస్తున్నాం. రాత్రి పగలనక కష్టపడి పనిచేస్తున్న తమకు ఫీజు వర్క్ కార్మికులుగా వినియోగించుకుంటున్నారు. పని చేస్తేనే దానికి సంబంధించిన కూలి డబ్బులు వస్తున్నాయి. ఒకవేళ పనులు లేకపోతే ఖాళీగా ఉండిపోతున్న. మాకు కనీస వేతనం అమలు చేస్తే బాగుంటుంది. 

 రాజు, నిర్మల్ డివిజన్ కార్యదర్శి

డిమాండ్లు పరిష్కరించండి 

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్, ఇస్ వర్క్, ఆన మ్యాన్ డిమాం డ్ల సాధనకై ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తు న ఆందో ళన నిర్వహిస్తున్నాం. ఇప్పటికీ మా సమస్యలను 2018 23లో ప్రభు త్వం దృష్టికి ఎంపీడీసీఎల్ దృష్టికి తీసుకువచ్చినం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినప్పటికీ సర్వీసు రూల్స్ అమలుచేసి పిఆర్సి పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. 

ఉమ్మడి జిల్లా కన్వీనర్ ఆదిలాబాద్

మావి న్యాయబద్ధమైన కోరికలే

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న తమ డిమాండ్లను ప్రభు త్వం వెంటనే పరిష్కరించాలి. ఆర్టిజన్ కార్మికులు సర్వీ సులు అమలుచేసి అరులేని వారికి పదోన్నతులు కల్పించాలి. తమ డిమాండ్లను ఇప్పటికే ఆయా విద్యుత్ శాఖ జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చి తమ పోరా టాన్ని కొనసాగిస్తున్నాం. సంస్థ యాజమాన్యం తమకు న్యాయం చేస్తుందని భావిస్తున్నాం

ఆర్టిజన్ కార్మికురాలు. నిర్మల్