మానవత్వం చాటుకున్న డాక్టర్ సంపత్ కుమార్
03-04-2026 01:20 AM
పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
తాండూరు, ఏప్రిల్ 2, (విజయ క్రాంతి) పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు వికారాబాద్ జిల్లా తాండూరు ప్రముఖ వైద్యులు ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్.
గురువారం తాండూరు పట్టణం 20వ వార్డు గాంధీనగర్ కు చెందిన జగన్నాథ్ సింగ్ అనే యువకుడు అకాల మరణం చెందిన విషయాన్ని వార్డ్ కౌన్సిలర్ భర్త సంతోష్ గౌడ్ తెలుపడంతో డాక్టర్ సంపత్ కుమార్ వెంటనే స్పందించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ యువకుడి అంత్యక్రియలకు వార్డు మాజీ కౌన్సిలర్ వినోద్ కుమార్ జైన్, మ్యాదర్ రవి,ఆర్తి,శివాజీ మామ, శ్రీకాంత్ రెడ్డి అఖిల్ ద్వారా ఆర్థిక సాయం అందించారు.




