3 September, 2026 | 2:21 AM

దాడిని ఖండిస్తూ నేడు నిరసనలు

14-11-2024 | 01:31am

టీజీఈజేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ 

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాం తి): వికారాబాద్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడికి నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (టీజీఈజేఏసీ) చైర్మ న్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

బుధవారం టీఎన్జీవో కేంద్ర సంఘం భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజ రు కావాలని, భోజన విరామ సమయంలో ఆం దోళన చేపట్టాలన్నారు.

సమావేశంలో డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఏఎం హుస్సేన్ ముజీబ్, కోచైర్మన్లు వి. రవీందర్, చావారవి, నాగిరెడ్డి, జి.జ్ఞానేశ్వర్, గ్రూప్ అధికారుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌గౌడ్, ఫైనాన్స్ సెక్రెటరీ కె.వెంకటేశ్వర్లు, ప్రచార కార్యదర్శి  బి.శ్యామ్, రాష్ర్ట కార్యదర్శి ముత్యాల సత్యనారాయణగౌడ్, కార్యదర్శులు గంగాధర్, గోల్కొండ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.