25 June, 2026 | 2:28 AM

మహిళల ఉన్నతి.. తెలంగాణకు ప్రగతి

25-06-2026 01:41 AM

జవహర్‌నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ చీరల పంపిణీ 

జవహర్ నగర్, జూన్ 24 (విజయక్రాంతి):  తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం ఆర్థిక సాధికారికతే లక్ష్యంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ బాలాజీ నగర్ డ్వాక్రా భవనంలో బుధవారం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మల్లెపూల శ్రీకాంత్ హాజరయ్యారు. మహిళా స్వయం సంఘాల సభ్యులకు మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, నంగునూరి అశోక్ గుప్తా, మాట్ల వినయ్, డి ఎస్ ఎస్ అధ్యక్షులు ఎర్రగుడ్ల వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు కోటేష్ గౌడ్, గజ్వేల్ శంకర్, చంద్రమౌళి, వెంకన్న, అనంతలక్ష్మి, నాయకం భాస్కర్ పటేల్, మాట్ల శ్రీను, మహిళలు తదితరులు పాల్గొన్నారు.