30 June, 2026 | 9:36 AM

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

01-08-2025 12:00 AM

జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

జగిత్యాల అర్బన్, జూలై 31(విజయ క్రాంతి): రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల ని, ఆసుపత్రిలో అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్ర సాద్ అధికారులను ఆదేశించారు. గురువారం జగిత్యాల రూరల్ మండలం  కల్లెడ  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేసారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్య సేవల గురించి నేరుగా పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు.

రోజుకు ఎన్ని ఓ.పి.లను చూస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఓ పి, ఐపి, ల్యాబ్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని చుట్టుపక్కల ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లు తొలగించి వెంటనే  శానిటేషన్ చేయించాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం సీజనల్  వ్యాధులు పై  అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

డెంగ్యూ, మలేరియా సీజనల్  వ్యాధులు ప్రబలకుండా అవసరమైన మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఆరోగ్య కేంద్రం ఆవరణంలో పేషంట్ల గదులు శుభ్రంగా ఉండేలా చూడాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. డాక్టర్లు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆ దేశిం చారు.కలెక్టర్ వెంట జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, డి ఎం హెచ్ ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్, కల్లెడ పిహెచ్ సెంటర్ డాక్టర్ సౌజన్య సంబంధిత అధికారులు ఉన్నారు.