31-07-2025 11:34:04 PM
జిల్లా అధికారుల సంఘం అధ్యక్షులు రవీందర్ రెడ్డి
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి. బాలసంకుల రాజ మనోహర్ రావు, కి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి గా రాజన్న సిరిసిల్లలో విధులు నిర్వహించి పదవి విరమణ పొదుతున్న రాజ మనోహర్ రావు గురువారం కలెక్టరేట్ ఆడిటోరియం లో డోర్స్ ఆద్వర్యంలో జిల్లా అధికారులు పూలమాలలు, శాలువాలతో సన్మానించి, వారికి జ్ఞాపికను అందజేసారు. ఈ సందర్భంగా సుదీర్ఘ కాలం 38 సంవత్సరాలు క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి, పదవి వీరమణ పొందడం అభినందనీయమని, అంకిత భావంతో ప్రజలకు విశిష్ట సేవలందించారని జిల్లా అధికారులు కొనియాడారు. పదవి విరమణ అనేది అనివార్యమని, ప్రభుత్వ సర్వీస్ లో ప్రతి ఒక్కరూ పదవీ విరమణ పొందుతారని, వారి భావిజీవితం సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని జిల్లా అధికారులు ఆకాంక్షించారు.