calender_icon.png 2 August, 2025 | 4:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా ఆరోగ్య సంరక్షణ కోసమే ప్రభుత్వ వైద్య కేంద్రాలు: కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

01-08-2025 12:00:00 AM

ఖమ్మం, జూలై 31 (విజయ క్రాంతి): ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసమే ప్రభుత్వ వైద్య కేంద్రాలు పని చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.గురువారం కూసుమంచి మండలం కేంద్రంలోని ఆయుర్వేద, యునానీ, హోమియో ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓ.పి. సేవలు, మందుల అందుబాటు, సూచిక బోర్డు, వైద్య సేవలు, ల్యాబ్ రికారడ్స్, మెడికల్ ఫార్మసి, ప్రసూతి కాన్పుల గది,

అపరేషన్ థియేటర్ పరిశీలించారు. డాక్టర్లు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, డాక్టర్లు ప్రతిరోజు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. రోజుకు ఎన్ని ఓ.పి. లను చూస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు.

రోగులకు వైద్యం పై సమగ్రంగా వివరాలు తెలిపి మందులు వాడే పద్దతిని వివరించాలని, వర్షాకాలం సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూసుమంచి మండల తహసీల్డార్ రవికుమార్, వైద్యాధికారులు డా. సాయికుమార్, తదితరులున్నారు.