calender_icon.png 7 September, 2025 | 10:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

07-09-2025 07:26:20 PM

కలెక్టర్ రాహుల్ రాజ్..

పాపన్నపేట: వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్(District Collector Rahul Raj) అన్నారు. ఆదివారం  పాపన్నపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రన్ని ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్య కేంద్రానికి  వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆసుపత్రిలో అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని తెలిపారు. ఆసుపత్రిలోని వార్డులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పాటించవలసిన జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని తెలిపారు.