07-09-2025 07:35:09 PM
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా..
ప్రమీల అంతిమ యాత్రలో పాల్గొని నివాళులర్పించిన సాబీర్
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): సమాజంలో శాంతిని నెలకొల్పేందుకు, ప్రజల మధ్య సోదరభావాన్ని నింపేందుకు యేసుక్రీస్తు బోధనలను ప్రచారం చేస్తూ తమవంతు కృషిని కొనసాగించిన దివంగతులు కోరి జాన్ ఫీటర్, జయ ప్రమీలాలు క్రైస్తవ కుటుంబాలకు ఆదర్శమని, నేటితరం వారి అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా(CPI District Secretary Sabir Pasha) అన్నారు. రామవరం ఏరియా వన్నందాస్ గడ్డకు చెందిన చర్చి కమిటీ మాజీ నాయకుడు, జాన్ పీటర్ సతీమణి, చర్చి స్త్రీలమైత్రం సంఘం నాయకురాలు జయ ప్రమీల (60) ఆదివారం అనారోగ్యంతో మృతిచెందారు.
మృతదేహాన్ని సందర్శించిన అయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన అంతమయాత్రలో 'కాఫిన్'ను మోసి వారి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యాన్ని చాటారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, కమ్యూనిస్టుని ఫీటర్ కుటుంబం ఆదరించేవారని, ప్రజా ఉద్యమాలను ప్రోత్సహించేవారన్నారు. నివాళులర్పించిన వారిలో సిపిఐ నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు, గుత్తుల శ్రీనివాస్, ఎస్ వి రామారావు, తొగరు నరేంద్ర కుమార్, ఆది మల్లయ్య, కడారి మల్లేష్ తదితరులు వున్నారు.