05-08-2025 12:00:00 AM
పీహెచ్సీ, కేజీబీవీలను తనిఖీ చేసిన కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, ఆగస్టు ౪ (విజయక్రాంతి): మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల, నస్పూర్ లలో సోమ వారం కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలను సందర్శించారు. నస్పూర్ పీహెచ్సీని సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వర్షాకాలం అయినందున అంటువ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన మందు లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. నస్పూర్ కేజీబీవీ, మంచిర్యాల పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాలలను సందర్శించి వంటశాల, మూత్రశాల లు, తరగతి గదులు, హాజరు పట్టికలు, పరిసరాలను పరిశీలించారు.
మధ్యాహ్న భోజ నంలో మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు గల ఆహారం, శుద్ధమైన తాగునీటిని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందిని కోరారు. తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యావసర సరుకులు వినియోగించుకోవాలని ఆదేశించారు. పదవ తరగతి విద్యార్థుల కు పాఠ్యాంశాలు బోధించి వివిధ సబ్జెక్టుల లో ప్రశ్నలు అడిగి వారి పఠనా సామర్థ్యాల ను తెలుసుకున్నారు.
మహిళా డిగ్రీ కళాశాల లో డిగ్రీ ఫ్రథమ సంవత్సరం విద్యార్థినులకు పాఠ్యంశాలు బోధించి ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని సాధించే దిశగా ఏకాగ్రతతో కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో నస్పూర్ పీహెచ్సీ డాక్టర్ వెంకటేశ్, కేజీబీవీ ఎస్‌ఓ మౌనిక, టీజీ ఎస్ డబ్ల్యూ ఆర్ డీ సీ (మహిళా) ప్రిన్సిపాల్ డాక్టర్ అనూష, తదితరులున్నారు.
ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్
కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి చంద్రయ్య, మంచిర్యాల, బెల్లం పల్లి ఆర్డీవోలు శ్రీనివాస్ రావు, హరికృష్ణలతో కలిసి స్వీకరించారు. ప్రభుత్వ భూ ములను కబ్జాదారుల నుంచి కాపాడాలని, పక్కన పెట్టిన వసతి గృహాలను అందుబాటులోకి తీసుకురావాలని,
పెన్షన్, ఇందిర మ్మ ఇండ్ల కోసం, కాస్తులో ఉన్న పట్టా ఇవ్వలేదని తదితర వివిధ సమస్యలను కలెక్టర్‌కు ఏకరువు పెట్టారు. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో వివి ధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.