calender_icon.png 5 August, 2025 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోవా మ‌ద్యం స్వాధీనం

05-08-2025 08:40:17 AM

మునిప‌ల్లి,(విజయక్రాంతి):   గోవా నుండి హైద‌రాబాద్(Goa-Hyderabad) కు తీసుకెళ్తున్న గోవా మ‌ద్యాన్ని కంకోల్ టోల్ ప్లాజా వ‌ద్ద  సంగారెడ్డి ఎక్సైజ్ అధికారులు ప‌ట్టుకొని   స్వాధీనం  చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా  సోమ‌వారం నాడు మునిప‌ల్లిమండ‌లం కంకోల్ టోల్  ప్లాజా   వ‌ద్ద వాహ‌నా ల‌ను త‌నిఖీ చేసి గోవా కు  చెందిన వివిధ బ్రాండ్ లకి సంబంధించిన 34  బాటిల్స్  (14.850) లిటర్స్ సుంకం చెల్లించని  మ‌ద్యాన్ని   స్వాధీనం చేసుకున్న‌ట్లు  ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ మేర‌కు ప‌ట్టుబ‌డిన గోవా  మ‌ద్యాన్ని సంగారెడ్డి ఎక్సైజ్  స్టేష‌న్ కు త‌ర‌లించారు. ఈ దాడుల్లో  డీటీఎఫ్ సీఐ శంకర్, వీరారెడ్డి, న‌జీర్ పాష,  ఎస్సైలు  అనుదీప్, హ‌న్మంత్,  స‌తీష్,  సిబంది తదితరులు   ఉన్నారు.