calender_icon.png 16 September, 2025 | 11:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త పెన్షన్లు అందించండి సార్

16-09-2025 12:00:00 AM

ఎల్లారెడ్డి సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): కొత్త ప్రభుత్వం కొలువుదీరి సుమారు రెండు సంవత్సరాలు కావస్తున్న కొత్త పెన్షన్లు ఇప్పటికీ ఊసే లేదని, వికలాంగుల సంఘం ఎల్లారెడ్డి సభ్యులు అధ్యక్షులు ఆదిమూలం సతీష్ అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎంతోమంది వితంతువులు వృద్ధులు అర్హులైన లబ్ధిదారులు పెన్షన్ కొరకు ఎదురుచూస్తున్నారని కొత్త పెన్షన్ల ఊసే లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా ఎన్నికల హామీలు ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చాలని తక్షణమే ఇచ్చిన మాట ప్రకారం 4000 రూపాయల పెన్షన్, అర్హులైన పలు లబ్ధిదారులకు ప్రభుత్వం చెప్పిన విధానంగా టెన్షన్ మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు మరియు పలువురు వికలాంగుల సంఘం సభ్యులు పలువురు వికలాంగులు తాసిల్దార్ ప్రేమ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు.